Rajinikanth: రజనీకాంత్‌తో నాకు విభేదాలా?.. క్లారిటీ ఇచ్చిన సత్యరాజ్‌

రజనీకాంత్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు నటుడు సత్యరాజ్‌. గతంలో రజనీ సినిమాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని వివరించారు.

Updated : 05 Jun 2024 19:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రజనీకాంత్‌కు తనకు మధ్య మనస్పర్థలు ఉన్నట్లు వస్తోన్న వార్తలపై సత్యరాజ్‌ స్పందించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. గతంలో తాను రజనీకాంత్‌ (Rajinikanth) సినిమాను అంగీకరించకపోవడానికి గల కారణాన్ని వివరించారు. ‘నేను ఇండస్ట్రీకి వచ్చాక రజనీకాంత్ సినిమాల్లో రెండు సార్లు అవకాశం వచ్చింది. ఆ పాత్రలు నాకు నచ్చలేదు. అందుకే తిరస్కరించాను. అంతేకానీ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’ అని సత్యరాజ్‌ స్పష్టం చేశారు. వీళ్లిద్దరూ కలిసి 38 ఏళ్ల తర్వాత ‘కూలీ’ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో (Coolie Movie) ఏ పాత్ర చేస్తున్నారనే విషయం సత్యరాజ్‌ ఇప్పుడే చెప్పనన్నారు. చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచిచూడాలన్నారు.

ట్రెండింగ్‌లో ‘కల్కి’.. లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ ఇవే..

1986లో కావేరీ జల వివాదం సందర్భంగా సత్యరాజ్‌.. రజనీకాంత్‌పై (Rajinikanth) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్నుంచీ ఈ సీనియర్లు కలిసి నటించ లేదు. తాజాగా వీళ్లిద్దర్నీ ఒప్పించి ‘కూలీ’లో నటించేలా చేశారు లోకేశ్‌. ఇందులో సత్యరాజ్‌.. రజనీకాంత్‌ స్నేహితుడిగా కనిపించనున్నారని సన్నిహితవర్గాలు తెలిపాయి. ‘కూలీ’ (Coolie) విషయానికొస్తే లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. కమల్‌హాసన్‌ అతిథి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో రజనీకి జోడీగా శోభన నటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని