Selvaraghavan: ధనుష్‌ డ్రీమ్‌ ప్రాజెక్టుపై రూమర్స్‌.. క్లారిటీ ఇచ్చిన సెల్వ రాఘవన్‌

తన సోదరుడు ధనుష్‌ డ్రీమ్‌ ప్రాజెక్టుపై వచ్చిన రూమర్స్‌పై దర్శకుడు సెల్వ రాఘవన్‌ స్పందించారు.

Published : 21 Feb 2024 02:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వీయ దర్శకత్వంలో ప్రముఖ హీరో ధనుష్‌ (Dhanush) నటిస్తున్న చిత్రం ‘రాయన్‌’ (Raayan). ఆయనకు ఇది 50వ సినిమా. ఈ మూవీ స్క్రిప్టును ధనుష్‌ సోదరుడు, దర్శకుడు సెల్వ రాఘవన్‌ (Selvaraghavan) రాశారని కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. దీనిపై రాఘవన్‌ స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆ రూమర్స్‌ను ఖండించారు. ‘‘రాయన్‌’ స్క్రిప్టు విషయంలో నేను జోక్యం చేసుకోలేదు. ఇది ధనుష్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు. తనే కథ రాసుకున్నాడు. ఇందులో నేను నటిస్తున్నానంతే. మీ అందరిలానే థియేటర్లలో ఈ సినిమాని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. పనిపై నా తమ్ముడికి ఉన్న అంకితభావం చూసి గర్వంగా ఫీలవుతున్నా’’ అని అన్నారు.

యాక్షన్‌ ప్రాధాన్యమున్న కథతో రూపొందుతున్న ఈ సినిమాలో ధనుష్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. అపర్ణా బాలమురళీ, సందీప్‌ కిషన్‌, కాళిదాస్‌ జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు, ధనుష్‌ 51వ చిత్రం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో ప్రముఖ నటుడు నాగార్జున (Nagarjuna) కీలకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక (Rashmika) కథానాయిక. సమాజంలోని అసమానతల నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతున్నట్లు సమాచారం. టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు.

ధనుష్‌కు దర్శకత్వం కొత్తేం కాదు. ఇంతకుముందు ‘పా.పాండి’ చిత్రాన్ని తెరకెక్కించారు. 7/జీ బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవన్‌.. ‘బీస్ట్‌’, ‘సాని కాయిదం’ (తెలుగులో చిన్ని)వంటి సినిమాల్లో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని