Shah Rukh Khan: ‘డంకీ’ రిలీజ్‌కు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన షారుక్‌..

షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘డంకీ’ (Dunki). ఈ సినిమా విడుదల నేపథ్యంలో షారుక్‌ జమ్ములోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు.

Updated : 12 Dec 2023 13:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగేళ్ల తర్వాత షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) ఈ ఏడాది ‘పఠాన్‌’తో ప్రేక్షకులను పలకరించి భారీ హిట్‌ను అందుకున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.1000 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూళ్లు చేసి ఈ బాలీవుడ్‌ బాద్‌షాకు తిరుగులేదని నిరూపించింది. అలాగే దీని తర్వాత ‘జవాన్‌’తో మరోసారి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ రెండు చిత్రాల విడుదలకు ముందు జమ్ములోని  ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని షారుక్‌ సందర్శించారు. ఇప్పుడు ‘డంకీ’ (Dunki) విడుదలకు ముందు కూడా ఆయన ఈ ఆలయానికి వెళ్లారు.

‘జవాన్‌’ (Jawan) విడుదలకు ముందు గతేడాది డిసెంబర్‌ 12న షారుక్‌.. వైష్ణోదేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. అలాగే ‘పఠాన్‌’కు ముందు ఆగస్టులో మరోసారి అక్కడికి వెళ్లారు. ఇప్పుడు ‘డంకీ’ విడుదల నేపథ్యంలో మూడోసారి ఈ ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన అభిమానులు షేర్‌ చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఈ ఆలయాన్ని దర్శించడం ఆయన సెంటిమెంట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ‘డంకీ’ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

ఆ పాత్ర నా కంఫర్ట్‌ జోన్‌లో లేదు..: సూర్య సినిమాపై బాబీ దేవోల్‌

రాజ్ కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో రానున్న ‘డంకీ’పై ఇప్పటికే అభిమానుల్లో భారీగా ఆశలు నెలకొన్నాయి. భారత్‌ నుంచి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించే నలుగురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది. డిసెంబర్‌ 21న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని