‘జెర్సీ’ విడుదల తేదీ చెప్పేశారు
ఈమధ్య క్రీడా నేపథ్యంలో వచ్చిన బయోపిక్‌లు అలరిస్తున్నాయి. ఈక్రమంలోనే తెలుగులో వచ్చి ప్రశంసలు అందుకున్న ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో నేచురల్ స్టార్ నాని క్రికెటర్‌గా కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే. ఆ సినిమాను అదే పేరుతో బాలీవుడ్లో తెరకెక్కిస్తున్నారు.
ముంబయి: ఈమధ్య క్రీడా నేపథ్యంలో వచ్చిన బయోపిక్‌లు అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో వచ్చి ప్రశంసలు అందుకున్న ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో నేచురల్ స్టార్ నాని క్రికెటర్‌గా కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే. ఆ సినిమాను అదే పేరుతో బాలీవుడ్లో తెరకెక్కిస్తున్నారు. అందులో షాహిద్‌కపూర్ క్రికెటర్‌గా నటించాడు. ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా.. చిత్రబృందం శుభవార్త చెప్పింది. సినిమా విడుదల తేదీని ప్రకటించింది. దీపావళి కానుకగా నవంబర్ 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు షాహిద్‌కపూర్ సినిమాలోని తన లుక్‌ను రివీల్ చేస్తూ ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
గత ఏడాది ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా షాహిద్‌కపూర్‌కు గాయమైన విషయం తెలిసిందే. దాని నుంచి కోలుకొని షాహిద్ వెంటనే షూటింగ్లో పాల్గొన్నాడు. గతంలో ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు హిందీలో రీమేక్‌గా వచ్చిన ‘కబీర్‌సింగ్’లోనూ షాహిద్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు తెలుగు దర్శకులు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. మృణాల్‌ఠాకూర్, పంకజ్‌కపూర్, తుషార్‌కపూర్, శరద్‌కేల్కర్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, దిల్‌రాజు, అమన్గిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్‌రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్‌కు ప్రమాదం..