Shatrughan Sinha: సోనాక్షి పెళ్లి రూమర్స్‌.. స్పందించిన శతృఘ్న సిన్హా

బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా వివాహంపై వచ్చిన రూమర్స్‌పై ఆమె తండ్రి, స్టార్‌ నటుడు శతృఘ్న సిన్హా స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

Updated : 11 Jun 2024 15:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. నటుడు జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షి వివాహం జరగనుందంటూ వార్తలు వచ్చాయి. తన కూతురి వివాహంపై వచ్చిన రూమర్స్‌పై నటుడు శతృఘ్నసిన్హా (Shatrughan Sinha) స్పందించారు. వారిద్దరి ప్రేమాయణం గురించి ఇప్పటివరకు తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు.

‘‘సోనాక్షి వివాహం చేసుకోనుందని ప్రచారం జరుగుతోంది. కానీ, దాని గురించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయం మీడియాకు కూడా తెలుసని.. మీ కూతురి వివాహం గురించి మీకు తెలియదా అని చాలామంది నన్ను అడిగారు. నిజంగా నాకు ఈ విషయం గురించి తెలియదు. ఎందుకంటే సోనాక్షి ఇప్పటివరకు నాకేమీ చెప్పలేదు. ఒకవేళ నా కూతురి వివాహం జరిగితే.. బారాత్‌ ముందు డాన్స్‌ చేయడానికి రెడీగా ఉన్నా’’ అని శతృఘ్నసిన్హా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘మొత్తంగా నేను చెప్పేది ఒక్కటే.. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల అనుమతి కోరడం లేదు. కేవలం సమాచారం ఇస్తున్నారు అంతే. ఇందుకోసం వేచిచూస్తున్నాం. సోనాక్షి నిర్ణయంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అదే నిజమైతే.. ఆ జంటను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా’’ అని అన్నారు.

నా కెరీర్‌లోనే బెస్ట్‌ సినిమా ఇది.. ‘ఇండియన్‌-2’లో తన పాత్రపై రకుల్‌ కామెంట్స్‌

కాగా.. సోనాక్షి, జహీర్ కొన్నేళ్ల నుంచి డేటింగ్‌లో ఉంటున్నారని వదంతులు వచ్చాయి. జూన్‌ 23న వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ముంబయిలో జరగబోయే ఈ వివాహానికి ఇప్పటికే హీరామండి చిత్ర బృందం సహా పలువురు సన్నిహితులు, ప్రముఖులకు ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శతృఘ్న సిన్హా తాజాగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని