Shruti Haasan: సేల్స్‌ గర్ల్‌గా పనిచేయాలని ఉండేది..: శ్రుతి హాసన్‌

నటి శ్రుతి హాసన్‌ (Shruti Haasan) తాజాగా తన ఇన్‌స్టాలో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

Updated : 15 Sep 2023 17:38 IST

హైదరాబాద్‌: కమల్‌ హాసన్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాసన్‌ (Shruti Haasan).. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శ్రుతిహాసన్‌ త్వరలోనే ‘సలార్‌’లో కనిపించనున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు.

టాటూలంటే ఇష్టమా?
శ్రుతి హాసన్‌: పిచ్చి. 19 ఏళ్ల వయసులో మొదటి సారి టాటూ వేయించుకున్నా. ఒకవేళ నటిని కాకుంటే ముఖం మీద కాకుండా ఒంటినిండా టాటూలు వేయించుకునేదాన్ని.

నటి కాకుంటే ఏ ఉద్యోగం చేసేవారు?
శ్రుతి హాసన్‌: సేల్స్‌ గర్ల్‌. నాకు చిన్నప్పుడు సేల్స్‌ గర్ల్‌ అవ్వాలని కోరిక. అందుకే ఏ దుస్తుల దుకాణానికి వెళ్లినా అక్కడ కస్టమర్లతో చాలా సేపు ముచ్చట పెట్టేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక ఆ ఆలోచన మారిపోయింది.

మీరెప్పుడైనా ఏడ్చారా?
శ్రుతి హాసన్‌: చాలా సార్లు ఏడ్చా. నాది చాలా సున్నిత మనస్తత్వం. అందుకే చిన్న విషయాలకు కూడా ఏడుస్తా. కాకపోతే అందరిలో ఏడవడం ఇష్టం ఉండదు. 

శంతనుతో ప్రేమ ఎలా మొదలైంది?
శ్రుతి హాసన్‌: తన ఆర్ట్‌ వర్క్‌ నచ్చి మొదట ఇన్‌స్టాలో ఫాలో అయ్యాను. అలా మొదలైన నా పరిచయం ప్రేమ వరకూ వచ్చింది. ఇన్‌స్టాలోనే మా ప్రేమ పుట్టింది.

 ‘ఈ ముఖాన్ని చూడటానికి థియేటర్‌కు వెళ్తారా..?’ అన్నారు: స్టార్‌ హీరోపై విశాల్‌ వ్యాఖ్యలు

పెళ్లెప్పుడు చేసుకుంటారు?
శ్రుతి హాసన్‌: బోరింగ్‌ ప్రశ్నలు అడగొద్దు.

మీది స్టార్‌ కుటుంబమైనా.. మీరెందుకు కష్టపడి పనిచేస్తున్నారు.
శ్రుతి హాసన్‌: నేను స్టార్‌ని కాదు.  మానాన్న పెద్ద హీరో. నేను సంపాదించింది మాత్రమే నాది అని భావిస్తా. అందుకే కష్టపడతా. ఒక నటిగా నా పాత్రకు నేను న్యాయం చేయాలనుకుంటాను. నటించడం, పాడడం.. ఇలాంటివి నాకు చాలా ఇష్టం.

మీరు వాడిన మొదటి ఫోన్‌.. మీకు ఇష్టమైన ప్రాంతం ఏది?
శ్రుతి హాసన్‌: నోకియా ఫోన్‌ వాడాను. నాకు లండన్ అంటే చాలా ఇష్టం.

ఇక ప్రస్తుతం శ్రుతి హాసన్‌ ‘సలార్‌’లో నటిస్తోంది. సెప్టెంబర్‌ 28న రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడించనున్నట్లు తెలిపింది. అలాగే నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘హాయ్‌ నాన్న’లోనూ శ్రుతి హాసన్‌ కనిపించనుంది. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని