Vishal: ‘ఈ ముఖాన్ని చూడటానికి థియేటర్‌కు వెళ్తారా..?’ అన్నారు: స్టార్‌ హీరోపై విశాల్‌ వ్యాఖ్యలు

కోలీవుడ్‌లోని ఓ స్టార్‌ హీరోని ఉద్దేశిస్తూ నటుడు విశాల్‌ (Vishal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ హీరో తనకు ఎంతో కాలం నుంచి తెలుసని.. ఆయన ఎదుర్కొన్న విమర్శలు కూడా తెలుసని చెప్పారు. 

Updated : 15 Sep 2023 14:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోలీవుడ్‌ స్టార్‌ హీరో, తన మిత్రుడు విజయ్‌ (Vijay)ను ఉద్దేశిస్తూ నటుడు విశాల్‌ (Vishal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మార్క్‌ ఆంటోనీ’ (Mark Antony) ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. విజయ్‌తో ఓ సినిమా తెరకెక్కించాలనుకుంటున్నానని అన్నారు. విజయ్‌ను డైరెక్ట్‌ చేయడం తన డ్రీమ్‌ అని చెప్పిన విశాల్‌.. అన్ని మంచిగా జరిగితే త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌ మొదలు కానుందన్నారు.

‘‘దర్శకత్వమంటే నాకెంతో ఇష్టం. విజయ్‌ని హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలనేది నా కల. త్వరలోనే అది నెరవేరుతుందనుకుంటున్నా. ఈ విషయంపై ఇప్పటికే చర్చలు జరిగాయి. కొంతకాలం క్రితం విజయ్‌ మేనేజర్‌కు ఫోన్‌ చేసి.. విజయ్‌కు కథ చెప్పాలనుకుంటున్నానని, ఒక గంట అపాయింట్‌మెంట్‌ కావాలని అడిగా. దానికి ఆ మేనేజర్‌ షాక్‌ అయ్యాడు. కాలేజీ రోజుల నుంచి విజయ్‌ నాకు తెలుసు. ఆయన నటుడిగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో.. ‘ఇలాంటి ముఖాన్ని డబ్బులు చెల్లించి మరీ థియేటర్‌ వెళ్లి ఎవరైనా చూడాలనుకుంటారా?’ అంటూ ఓ మ్యాగజైన్‌లో వార్తలు రాశారు. ఆ విమర్శలను ఒక సవాల్‌గా తీసుకుని, బాగా శ్రమించారు. కొన్నేళ్ల తర్వాత అదే మ్యాగజైన్‌లో విజయ్‌.. సక్సెస్‌ఫుల్‌ జర్నీ, బ్లాక్‌బస్టర్‌ సినిమాలపై కథనాలు వచ్చాయి. అదీ.. విజయ్‌ అంటే..!’’ అని విశాల్‌ చెప్పారు.

Vishal: 19ఏళ్ల కెరీర్‌లో 12 పెళ్లిళ్లు చేశారు.. అందుకే తొలిసారి ట్వీట్‌ చేశా: నటుడు విశాల్‌

విజయ్‌ ‘లియో’ (Leo) లో తనకు ఆఫర్‌ వచ్చిందని ఆయన చెప్పారు. కాకపోతే డేట్స్‌ సర్దుబాటు కాక దాన్ని వదులుకున్నానని అన్నారు. ‘మార్క్‌ ఆంటోనీ’ తర్వాత ‘తుప్పరివాలన్‌ 2’ (డిటెక్టివ్‌2)పై దృష్టి పెట్టాలనుకుంటున్నానని.. లండన్‌లోని కోహినూర్‌ డైమండ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిపారు. ఆ ప్రాజెక్ట్‌ తనకొక బిడ్డలాంటిదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని