Sunny Deol: సన్నీ దేవోల్ వైరల్ వీడియోపై రూమర్స్‌.. స్వయంగా స్పందించిన నటుడు

తాజాగా బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవోల్‌కు (Sunny Deol) సంబంధించిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు.

Published : 06 Dec 2023 18:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటీనటులకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారతాయి. ఇక అగ్రతారల ఫొటోలు, వీడియోలపై నెటిజన్లకు ఆసక్తి ఎక్కువ. తాజాగా బాలీవుడు నటుడు సన్నీ దేవోల్‌కు (Sunny Deol) సంబంధించిన ఓ వీడియో ఎక్స్‌లో వైరల్‌గా మారింది. దీనిపై కొందరు నెటిజన్లు ఆయన్ను విమర్శిస్తూ కామెంట్స్‌ చేశారు. దీంతో ఆయనే స్వయంగా దీనిపై స్పందించారు.

అర్ధరాత్రి రోడ్డుపై సన్నీ దేవోల్‌ తూలుతూ వెళ్తున్న వీడియో తాజాగా ఎక్స్‌లో తెగ షేర్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘మీరు మద్యం తాగారా’, ‘రాత్రి వేళ రోడ్డుపై ఏం చేస్తున్నారు’ అంటూ రకరకాల కామెంట్స్‌ పెట్టారు. అయితే ఇది నిజం కాదని ఆయన అభిమానులు చెబుతున్నప్పటికీ ఈ కామెంట్స్ మాత్రం ఆగలేదు. దీంతో ఇది తన తాజా చిత్రం ‘సఫర్‌’ షూటింగ్‌లో భాగమంటూ సన్నీ దేవోల్ పేర్కొన్నారు. షూటింగ్‌ తీస్తోన్న వీడియోను ఆయన షేర్‌ చేశారు. ‘ఇప్పటికైనా రూమర్స్‌ ఆగుతాయని భావిస్తున్నా’ అని క్యాప్షన్‌ రాశారు. దీంతో ఈ రూమర్స్‌కు చెక్‌ పడినట్లైంది. నిజానికి సన్నీదేవోల్‌ మద్యం తాగరు. ఈ విషయాన్ని ఆయన చాలా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘జవాన్‌’కు అరుదైన గౌరవం.. ఆనందంగా ఉందంటూ అట్లీ పోస్ట్‌

ఇక సన్నీ దేవోల్‌ ఈ ఏడాది ‘గదర్‌2’ (Gadar 2)తో విజయాన్ని అందుకున్నారు. అనిల్‌శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ.700 కోట్లు వసూళ్లు చేసింది. ప్రస్తుతం ఆయన మూడు సినిమాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు అలాగే బాలీవుడ్‌లో తెరకెక్కనున్న రామాయణం సినిమాలో హనుమంతుడి పాత్రలో నటించనున్నట్లు సమాచారం.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని