Tanikella Bharani: ఆరోజు సీతారామశాస్త్రి ఎంతో బాధపడ్డారు: తనికెళ్ల భరణి

నటుడు తనికెళ్ల భరణి, రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Updated : 03 Jun 2024 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు నటుడు తనికెళ్ల భరణి. ఆయన సొంత అన్నయ్యతో సమానమన్నారు. సీతారామశాస్త్రి కలం పేరు భరణి అని తెలిపారు.  ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న తనికెళ్ల భరణి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘సీతారామశాస్త్రి ఎన్నో గొప్ప పాటలను అందించారు. ట్యూన్‌కు సరిపోయేలా రాయడం కోసం కొన్ని పాటలకు చాలా కష్టపడేవారు. నేను స్టూడియో నుంచి రాత్రి 10 గంటలకు వెళ్లిపోతే ఆయన రాత్రంతా అక్కడే ఉండి పాట రాయడం పూర్తయ్యాక వెళ్లేవారు. అలా రాసిన పాటల్లో ‘లేడీస్‌ టైలర్‌’లోని ‘ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే..’ ఒకటి. ఈ పాట కోసం వారం రోజులు శ్రమపడ్డారు. మిగతా కవులు పది పాటలు రాసే సమయంలో ఆయన ఒక్క పాటే రాసేవారు. ప్రతీ పదాన్ని వజ్రంలా తయారుచేస్తారు. గొప్ప ప్రతిభావంతుడు, అపార పద సంపద ఆయన సొంతం. ఎంతో నిజాయతీగా ఉండేవారు. రొమాంటిక్ పాటల్లో కూడా డబుల్‌ మీనింగ్‌ పదాలు వాడకుండా అద్భుతంగా రాసేవారు. ఆయన రాసిన పాట ఐఎస్‌ఐ మార్క్‌తో సమానం’. 

‘హీరామండి-2’ ప్రకటించిన దర్శకుడు.. ఏం చూపనున్నారంటే!

‘పాట రాస్తున్నది ఏ స్థాయి సినిమాకు అని ఎప్పుడూ చూడలేదు. చిన్న దర్శకుడికి రాసినా, పెద్ద సినిమాకు రాసినా ఒకేలా ఆలోచించేవారు. ప్రతీ పాటకు ప్రసవవేదన అనుభవించి అద్భుతమైన పాట రాసేవారు. కొత్త పదాలను సృష్టించేవారు. ఒకసారి ఆయన ఎంతో కష్టపడి పాట రాస్తే.. దర్శకుడు ఇంత పెద్దలైన్స్‌ రాశారేంటని అన్నారు. ఆరోజు శాస్త్రిగారి అసహనాన్ని చూశాను. బాగుందో, లేదో చెప్పకుండా అలా అనేసరికి ఎంతో బాధ పడ్డారు. ప్రతీ పాటను సవాలుగా తీసుకొనేవారు’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని