Tillu Square: టిల్లు స్క్వేర్‌కు క్రేజ్‌ మామూలుగా లేదు.. భారీ ధరకు ఓటీటీ రైట్స్‌?

Tillu Square ott deal: సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్క్వేర్‌’ ఓటీటీ రైట్స్‌ క్రేజీ ప్రైస్‌కు అమ్ముడుపోయినట్లు సమాచారం.

Published : 21 Feb 2024 13:46 IST

హైదరాబాద్‌: సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా రూపొందిన రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీ మూవీ ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). మల్లిక్‌రామ్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్‌ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రచార చిత్రంలో హీరో,హీరోయిన్‌ల మధ్య సంభాషణలు ‘డీజే టిల్లు’ చిత్రాన్ని గుర్తు చేశాయి. అనుపమ మునుపెన్నడూ కనిపించనంత హాట్‌గా ఇందులో దర్శనమిచ్చి యువత మతి పోగొట్టింది.

థియేటర్‌లో విడుదల కాకముందే ‘టిల్లు స్క్వేర్‌’ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ కోసం భారీ డిమాండ్‌ నెలకొనగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) సర్‌ప్రైజింగ్‌ అమౌంట్‌ కోట్‌ చేసి, హక్కులు దక్కించుకున్నట్లు టాక్‌. రూ.35 కోట్లకు ఈ డీల్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఒక యువ కథానాయకుడి చిత్రానికి ఈ స్థాయిలో డీల్‌ జరగడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయింది. ‘డీజే టిల్లు’లో తన నటన, స్వాగ్‌తో యూత్‌ ఐకాన్‌ అయిపోయారు సిద్ధు జొన్నలగడ్డ. దీంతో ‘టిల్లు స్క్వేర్‌’ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. రామ్‌ మిర్యాల సంగీతం అందించిన ఈ చిత్రానికి తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని