బంగారపు కేక్‌ కట్‌ చేసిన నటి.. నెటిజన్ల రియాక్షనిదే..

నటి ఊర్వశీ రౌతేలా తన పుట్టినరోజు సందర్భంగా బంగారపు కేక్‌ కట్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

Published : 26 Feb 2024 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela). తాజాగా తన పుట్టినరోజు కేక్‌ కటింగ్‌తో మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యారు. తన కోస్టార్‌ హనీసింగ్ ఊర్వశీతో బంగారపు కేక్‌ కట్‌ చేయించడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఊర్వశీ తన 30వ పుట్టిన రోజును చేసుకున్నారు. ఈసందర్భంగా ఆమె కోస్టార్‌, పాప్‌ సింగర్‌ యో యో హనీసింగ్‌ ఆమెతో రూ.3 కోట్ల విలువైన బంగారపు కేక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి కట్‌ చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తాజాగా షేర్‌ చేసింది. ‘హనీ సింగ్ నువ్వు నాపై చూపించే ప్రేమకు ధన్యవాదాలు. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని రాసుకొచ్చారు.

అంత విలువైన కేక్‌ కట్‌ చేయించడంపై హనీ సింగ్‌ స్పందించారు. ‘ఊర్వశీ ప్రపంచంలోనే అందమైన మహిళ. ఈ విషయాన్ని ఆమెతో ఎన్నోసార్లు చెప్పాను. తన సినీ ప్రయాణాన్ని గమనిస్తే చిన్న నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగింది. ఏ కోస్టార్‌ తన సహనటుల కోసం చేయని పనిని నేను ఆమె కోసం చేయాలనుకున్నా. అందుకే ఇంత విలువైన కేక్‌ తీసుకొచ్చా. ఈ పుట్టినరోజు చరిత్రలో నిలిచిపోతుంది’ అంటూ ప్రశంసలు కురిపించాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఇలాంటి పుట్టినరోజు చేసుకున్న మొదటి మహిళ మీరే’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘దీన్ని కట్‌ చేశాక తినాలా? దాచుకోవాలా?’ అని మరో యూజర్‌ స్పందించారు. వైరల్‌ కావడం కోసం ఇంత ఖర్చు చేయలా అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. 

రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తంచేశారు!

గతేడాది స్టార్‌ హీరోల సినిమాల్లో వరుసగా ఐటెమ్‌ సాంగ్స్‌ చేసి ప్రేక్షకులను ఊర్రూతలూగించిన ఊర్వశీ ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ‘#Nbk109’లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని