Pawan Kalyan: పవన్ కల్యాణ్‌- సురేందర్‌ రెడ్డి కాంబో.. నేపథ్యమిదే!

పవన్‌ కల్యాణ్‌- సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా నేపథ్యమేంటో రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ వెల్లడించారు.

Published : 08 Dec 2023 02:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ హీరో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)- డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ప్రకటన వెలువడి చాలా కాలమైనా దానిపై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఆ సినిమా రచయిత వక్కంతం వంశీ (Vakkantham Vamsi) తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఆ చిత్రం సోషల్‌ సెటైర్‌గా తెరకెక్కనుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. స్టోరీ నచ్చడంతో.. ఎప్పుడెప్పుడు షూటింగ్‌కు వెళ్దమా అని అనిపించిందని పవన్‌ కల్యాణ్‌ ఆసక్తి కనబరిచారని వంశీ పేర్కొన్నారు. తాను దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌’ (Extra OrdinaryMan) ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విశేషాలు పంచుకున్నారు. తాను కథ అందించిన ‘ఏజెంట్‌’ (Agent) గురించి మాట్లాడుతూ.. బిజీగా ఉండడం వల్ల తాను ఆ సినిమాని థియేటర్‌లో చూడడం మిస్‌ అయ్యానని, ఓటీటీ రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నాని అన్నారు.

మెగా ఫ్యామిలీ హీరోలతో ‘నెట్‌ఫ్లిక్స్‌’ కో- సీఈవో ముచ్చట.. ఫొటోలు వైరల్‌

నితిన్‌ (Nithiin), శ్రీలీల (SreLeela) జంటగా నటించిన చిత్రమిది. ఈ సినిమాలో నితిన్‌.. జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నవ్వులు పంచనున్నారు. ప్రముఖ హీరో రాజశేఖర్‌ (Rajasekhar) కీలక పాత్ర పోషించిన ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్‌ కల్యాణ్‌ సినిమాల విషయానికొస్తే.. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh), ‘ఓజీ’(OG), ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రీకరణ దశలో ఉన్నాయి. రాజకీయంగా బిజీగా ఉండడంతో కాస్త విరామం ఇచ్చారు. అవి పూర్తయిన తర్వాత సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నటిస్తారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’తో ఆయన దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన సినిమా ఇది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని