Vijay sethupathi: రామోజీరావు విజన్‌కు ఫిల్మ్‌ సిటీనే నిదర్శనం: విజయ్‌ సేతుపతి

రామోజీ ఫిల్మ్‌సిటీతో తనకెన్నో జ్ఞాపకాలున్నాయని హీరో విజయ్‌ సేతుపతి అన్నారు. రామోజీ ఇక లేరనే వార్త విని బాధ పడినట్లు చెప్పారు.

Updated : 10 Jun 2024 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఇక లేరన్న వార్త విని ఎంతో బాధపడినట్లు హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) తెలిపారు. తన తాజా చిత్రం ‘మహారాజ’ ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. రామోజీ ఫిల్మ్‌సిటీతో తనకు ఎంతో అనుబంధముందని చెప్పారు.

‘హైదరాబాద్‌తో కంటే రామోజీ ఫిల్మ్‌సిటీతోనే నాకు జ్ఞాపకాలు ఉన్నాయి. 2005లో ధనుష్‌ సినిమా కోసం తొలిసారి ఫిల్మ్‌సిటీకి వెళ్లాను. అది చూశాక ఒక్క వ్యక్తి ఇంత సాధించగలడా అనిపించింది. సినిమాకు సంబంధించి ఏం కావాలో అవన్నీ ఫిల్మ్‌సిటీలో కనిపించడం చూసి ఆశ్చర్యపోయాను. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది దర్శకులు మంచి సినిమాలు తీస్తున్నారంటే అందులోని సదుపాయాలే కారణం. రామోజీరావు విజన్‌కు ఫిల్మ్‌సిటీనే నిదర్శనం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.

సమాజంలో చైతన్యం నింపిన అక్షర సేనాని రామోజీరావు

రామోజీరావు అక్షరానికి కొత్త శక్తినిచ్చారు: నిర్మాత ఎన్వీ ప్రసాద్‌

‘రామోజీరావు సినీ పరిశ్రమకు గొప్ప సేవలందించారు. అక్షరానికి కొత్త శక్తినిచ్చారు. తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని రామోజీ ఫిల్మ్‌సిటీని నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దారు. ఆయన (Ramoji Rao) మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని