Maaveeran: స్టార్‌ హీరోల సతీమణులు.. థియేటర్‌లో ముచ్చట్లు.. వీడియో వైరల్‌!

Published : 14 Jul 2023 22:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇద్దరు స్టార్‌ హీరోలు ఎక్కడైనా కలిసినా, వారి కుటుంబ సభ్యులు పలకరించుకున్నా అభిమానులకు కన్నుల పండగే. అలాంటి వాతావరణమే నెట్టింట శుక్రవారం కనిపించింది. అటు విజయ్‌ (Vijay) ఫ్యాన్స్‌, ఇటు శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) ఫ్యాన్స్‌లో జోష్‌ నింపిన ఆ విశేషమేంటంటే..?

శివ కార్తికేయన్‌ హీరోగా దర్శకుడు మడోన్‌ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మావీరన్‌’ (Maaveeran) (తెలుగులో మహావీరుడు). అదితి శంకర్‌ కథానాయిక. ఈ సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసేందుకు విజయ్‌ భార్య సంగీత, శివకార్తికేయన్‌ భార్య ఆర్తి చెన్నైలోని ఓ థియేటర్‌కు వెళ్లారు. బ్రేక్‌ సమయంలో ఇద్దరు ముచ్చటించుకున్నారు. సంబంధిత దృశ్యాలను అక్కడి ప్రేక్షకులు తమ ఫోన్లో బంధించి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. మీరూ చూసేయండి..



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని