Vimanam: తండ్రీతనయుల విమానం గోల

వీరయ్య దివ్యాంగుడు అయినా కొడుకుని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కొడుక్కి విమానం ఎక్కడం అంటే ఇష్టం. ఎప్పుడూ పదే పదే తండ్రిని అదే అడుగుతాడు.

Updated : 14 May 2023 13:04 IST

వీరయ్య దివ్యాంగుడు అయినా కొడుకుని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కొడుక్కి విమానం ఎక్కడం అంటే ఇష్టం. ఎప్పుడూ పదే పదే తండ్రిని అదే అడుగుతాడు. మరి తండ్రీ కొడుకుల ఈ విమానం చివరికి ఏమైందో తెలియాలంటే ‘విమానం’ సినిమా చూడాల్సిందే అంటున్నారు సముద్రఖని. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. మాస్టర్‌ ధ్రువన్‌, మీరా జాస్మిన్‌, అనసూయ, రాహుల్‌రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శనివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. శివ ప్రసాద్‌ యానాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌, కిరణ్‌ కొర్రపాటి నిర్మిస్తున్నారు. జూన్‌ 9న సినిమా విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు