Vishwak Sen: సినిమా చూడకుండానే రివ్యూ ఇచ్చారు: విష్వక్‌ సేన్‌

విష్వక్‌ సేన్‌ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ శుక్రవారం విడుదలైంది. కొందరు చూడకుండానే రివ్యూలు ఇచ్చారని హీరో అన్నారు.

Published : 01 Jun 2024 00:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేక్షకుల ముందుకు శుక్రవారం వచ్చిన తన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari)ని చూడకుండానే కొందరు రివ్యూలు ఇచ్చారని నటుడు విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) పేర్కొన్నారు. సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన వాటిలో ఒకటైన సంగీతం బాగాలేదని సదరు రివ్యూల్లో ఉందని తెలిపారు. వారు మూవీ చూడలేదని అక్కడే అర్థమైందన్నారు. సినిమాని చూసి అందులోని వీక్‌ పాయింట్‌ని సమీక్షించడంలో తప్పులేదన్నారు. చిత్రం విడుదలైన సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు కృష్ణచైతన్య (Krishna Chaitanya)తో కలిసి విష్వక్‌ పాల్గొన్నారు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. మూవీ రిలీజైన వారానికి రివ్యూలు ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై టాలీవుడ్‌లో ఇటీవల చర్చ జరిగిన సంగతి తెలిసిందే. దాన్ని గుర్తుచేస్తూ ఓ విలేకరి ప్రశ్నించగా విష్వక్‌ స్పందించారు. వారం సంగతేమోగానీ సినిమా చూడకుండా ఉదయం 6 గంటలకే రివ్యూలు రాశారని అన్నారు. టికెట్‌ కొన్న వారికే ‘బుక్‌ మై షో’లో రేటింగ్‌ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’

పాత్రల విషయంలో తన ఎంపిక గురించి మాట్లాడుతూ.. ‘‘ఒకేలాంటి పాత్రల్లో నటించాలంటే నాకే బోర్‌ కొడుతుంది. సవాలు విసిరే క్యారెక్టర్లనే ఎంపిక చేసుకుంటుంటా’’ అని తెలిపారు. ‘‘సెకండాఫ్‌ గురించి మహిళలు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. చాలా ఎమోషనల్‌గా ఉందని చెబుతున్నారు. అబ్బాయిలకు యాక్షన్‌ సన్నివేశాలు నచ్చాయి. సినిమా చాలా బాగుందంటూ హీరో బాలకృష్ణ ఇచ్చిన ప్రశంస మర్చిపోలేను. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’కి సీక్వెల్‌ తప్పక ఉంటుంది. ‘పవర్‌ పేట’ గురించీ త్వరలోనే అప్‌డేట్‌ ఇస్తా’’ అని కృష్ణ చైతన్య పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రదర్శన ద్వారా సినిమాని చూసిన బాలకృష్ణ టీమ్‌ని అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని