Vyjayanthi Movies: ఆ సినిమాపై పూర్తి హక్కు మాకే ఉంది : వైజయంతి మూవీస్‌

చిరంజీవి (Chiranjeevi) - శ్రీదేవి (Sridevi) జంటగా నటించిన క్లాసిక్‌ హిట్‌ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari). ఈ చిత్రాన్ని ఉద్దేశించి చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఓ ట్వీట్‌ చేసింది.

Updated : 11 Oct 2023 14:42 IST

హైదరాబాద్‌: తమ బ్యానర్‌లో నిర్మితమైన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) కాపీ రైట్స్‌ విషయంలో సినీ వర్గాలను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ హెచ్చరించింది. ఆ సినిమాపై పూర్తి హక్కు తమకే ఉందని అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టింది.

Israel: నా సోదరిని ఆమె పిల్లల ముందే దారుణంగా చంపేశారు: హమాస్‌ ఉగ్రదాడిపై నటి ఆవేదన

‘‘1990లో చిరంజీవి - శ్రీదేవి జంటగా కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. మా బ్యానర్‌లో ఇది నిర్మితమైంది. ఈ చిత్రానికి సంబంధించిన కథ, కథనం, పాత్రలు.. ఇలా అన్నింటిపై కాపీరైట్‌ హక్కులు మాకే ఉన్నాయి. దీనికి సంబంధించిన రీమేక్‌లు, ప్రీక్వెల్స్‌, సీక్వెల్స్‌, వెబ్‌సిరీస్‌లు తీర్చిదిద్దే హక్కు కేవలం మాకే ఉంది. మేము ఎవరికీ హక్కులు ఇవ్వలేదు. కాపీరైట్‌ హక్కులను ఉల్లంఘిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం’’ అని వైజయంతి మూవీస్‌ పేర్కొంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌ దీనిని నిర్మించారు. 1990 మేలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని