Article 370: ‘ఆర్టికల్‌ 370’ చిత్రాన్ని నిషేధించిన గల్ఫ్‌ దేశాలు.. కారణమిదే!

ఇటీవల విడుదలైన ‘ఆర్టికల్‌ 370’ చిత్రంపై గల్ఫ్‌ దేశాలు నిషేధం విధించాయి.

Updated : 26 Feb 2024 15:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యామీ గౌతమ్‌ (Yami Gautam) ప్రధాన పాత్రలో ఆదిత్య సుహాస్‌ జంభాలె తెరకెక్కించిన చిత్రం ‘ఆర్టికల్‌ 370’ (Article 370). ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా దీనిపై  కొన్ని దేశాలు నిషేధం విధించడం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

ఆర్టికల్‌ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తాజాగా గల్ఫ్‌ దేశాలన్నీ ఈ సినిమాపై నిషేధం విధించాయి. ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయడంపై స్పష్టమైన కారణాలు లేనప్పటికీ ఇందులో కొన్ని సన్నివేశాలు ఆందోళనకరమైన ధోరణిలో ఉన్నాయని అందుకే ఆయా దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్రాలకు ఆదరణ లభించే గల్ఫ్‌ దేశాల్లో దీన్ని బ్యాన్ చేయడం పలు వివాదాలకు దారితీస్తోంది. గత నెలలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్‌ చిత్రం ‘ఫైటర్‌’ను కూడా అక్కడ బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే. యూఏఈ మినహా ఎక్కడా కూడా ‘ఫైటర్‌’ను ప్రదర్శించలేదు.

ఈ వారం థియేటర్‌ / ఓటీటీ చిత్రాలివే!

‘ఆర్టికల్‌ 370’లో యామీ గౌతమ్‌ పవర్‌ఫుల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌గా యాక్షన్‌ అవతారంలో నటించగా ప్రియమణి కీలకపాత్రలో కనిపించారు. ఈ చిత్రం విడుదలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓ మీటింగ్‌లో దీన్ని ప్రస్తావించారు. కొన్ని విషయాల గురించి సరైన సమాచారం తెలుసుకోవాలంటే ఇలాంటి చిత్రాలను చూడాలని ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని