NTR: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ.. ప్రకటించిన దర్శకుడు

నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. నాలుగోతరం హీరోను పరిచయం చేయనున్నట్లు వైవిఎస్‌ చౌదరి ప్రకటించారు.

Updated : 10 Jun 2024 15:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అ విషయాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరి అధికారికంగా ప్రకటించారు. తన భార్య గీత నిర్మాతగా న్యూ టాలెంట్‌ రోర్స్‌ (NewTalentRoars (@NTR)) అనే కొత్త బ్యానర్‌ను వైవీఎస్‌ ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై రానున్న తొలి సినిమాతోనే నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగోతరం హీరోను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు.

‘సీనియర్‌ ఎన్టీఆర్‌ మునిమనవడు.. హరికృష్ణ మనవడు.. దివంగత జానకిరామ్‌ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును నేను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. హరికృష్ణతో సినిమాలు తీసే అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు ఆయన మనవడిని కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నా’ అని వైవిఎస్‌ చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. ఇందులో తెలుగుఅమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు సమాచారం. మరో ఈవెంట్‌ పెట్టి హీరో హీరోయిన్లను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.

మాస్‌ డైరెక్టర్‌తో బాలకృష్ణ.. నాలుగోసారి రిపీట్‌ కానున్న కాంబో

‘సీతా రాముల కల్యాణం చూదము రారండి’ మొదలుకొని ‘యువరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’, ‘దేవదాస్‌’.. వంటి ఎన్నో హిట్‌ సినిమాలు తెరకెక్కించారు దర్శకుడు వైవిఎస్‌ చౌదరి. చివరిగా ‘రేయ్‌’తో పలకరించారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఇప్పుడీ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని