DK Shivakumar: కాంగ్రెస్‌లో చేరేందుకు.. 40 మంది భాజపా, జేడీఎస్‌ నేతలు సిద్ధం!

 భాజపా-జేడీఎస్‌ కలిసి పనిచేయడాన్ని వ్యతిరేకిస్తోన్న ఆ రెండు పార్టీలకు చెందిన 40మంది నేతలు.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పేర్కొన్నారు.

Published : 12 Oct 2023 23:15 IST

బెంగళూరు: మాజీ ప్రధాని దేవేగౌడ నేతృత్వంలోని జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీ నిర్ణయాలతో కర్ణాటక రాజకీయ సమీకరణాలు తరచూ మారడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ భాజపాతో చేతులు కలిపింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని ప్రకటించి ఎన్డీయేలో చేరింది. ఈ పరిణామాలపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపా-జేడీఎస్‌ కలిసి పనిచేయడాన్ని వ్యతిరేకిస్తోన్న ఆ రెండు పార్టీలకు చెందిన 40మంది నేతలు.. కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు చెప్పారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరఫున టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే రామప్ప లమాని.. తాజాగా కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మాట్లాడుతూ.. ‘ ఆ రెండు పార్టీలకు సంబంధించి 40 మందిపైగా నేతల దరఖాస్తులు నా దగ్గర ఉన్నాయి. ఈ సమాచారాన్ని ఎప్పుడూ బహిరంగ పరచవద్దని భావించా. కానీ, ప్రస్తుతం ఆ సమయం వచ్చింది. స్థానిక నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక్కొక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తాం’ అని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం శివకుమార్‌ వెల్లడించారు. వీరిలో బీదర్‌తోపాటు చామరాజనగర్‌కు చెందిన నేతలే ఎక్కువగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

లైంగిక వేధింపులకు గురైనందుకే.. మంత్రి పదవికి రాజీనామా

భాజపా-జేడీఎస్‌ కూటమిని వ్యతిరేస్తూ అనేక మంది తమ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు డీకే శివకుమార్‌ తెలిపారు. వీరి చేరిక ద్వారా తమ పార్టీకి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. వీరితోపాటు ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫున ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన 100 మంది నాయకులు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని