TDP: చంద్రబాబును కలిసిన ఆలపాటి రాజా, ఎంఎస్‌ రాజు

మూడో జాబితాలో టికెట్‌ రాని ఆశావహులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో బుజ్జగించారు.

Updated : 24 Mar 2024 14:45 IST

అమరావతి: మూడో జాబితాలో భంగపడిన ఆశావహులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో బుజ్జగించారు. సీనియర్ నేత ఆలపాటి రాజా, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు చంద్రబాబును ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి కలిశారు. పొత్తులో భాగంగా తెనాలి శాసనసభ స్థానం జనసేనకు వెళ్లినందున గుంటూరు పశ్చిమను రాజా ఆశించారు. పొత్తులో జరిగిన సర్దుబాటును అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరినట్లు తెలిసింది.

30ఏళ్లుగా తాను రాజకీయాల్లో పోరాడుతున్నానని, ఏనాడూ తాను పదవులు కోరుకోలేదని రాజా చంద్రబాబుతో అన్నట్లు సమాచారం. తాను పార్టీ నిర్ణయాలను ధిక్కరించే వ్యక్తిని కాదని, మనసులో ఎంత బాధ ఉన్నా అధినేత నిర్ణయాన్ని శిరసావహిస్తానని, ఆయన అప్పగించిన బాధ్యతలు తప్పకుండా నిర్వర్తిస్తానని రాజా బదులిచ్చినట్లు తెలిసింది. బాపట్ల ఎంపీ స్థానం ఆశించిన ఎమ్‌ఎస్‌ రాజుకు తగిన ప్రత్యామ్నాయం చూస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అధినేత మాటే శిరోధార్యమని, చంద్రబాబుపై తనకు నమ్మకం ఉందని రాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని