AP News: పిన్నెల్లి పరారీ.. పోలీసుల అసమర్థతకు నిదర్శనం: ప్రత్తిపాటి

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ పోలీసుల అసమర్థతకు నిదర్శనమని తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.

Published : 23 May 2024 13:33 IST

అమరావతి: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ పోలీసుల అసమర్థతకు నిదర్శనమని తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. నిందితులకే పోలీసులు పహారా కాస్తారని మరోసారి నిరూపించారన్నారు. వివేకా హత్య కేసు నిందితుడు అవినాష్‌ను ఇలానే దగ్గరుండి కాపాడారని ఆరోపించారు.

‘‘ఈసీ ఆదేశించినా అరెస్టు చేయకుండా ఎవరి కళ్లకు గంతలు కడుతున్నారు? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పిన్నెల్లిని పోలీసులే విహారయాత్రకు పంపినట్లుంది. ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్టు చేయరు. డీజీపీ, పోలీసులు వైకాపా ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. ఈసీ ఇకనైనా వారి నిజస్వరూపం తెలుసుకోవాలి. సీబీఐని రంగంలోకి దించాలి. పిన్నెల్లిని పట్టుకోలేని వారికి చలో మాచర్లను అడ్డుకునే హక్కు ఎక్కడిది? ఆయన్ను తప్పించడంలో మొదట్నుంచీ అధికారుల పాత్ర సుస్పష్టం’’ అని ప్రత్తిపాటి ఆరోపించారు.

పిన్నెల్లి దేశం వదిలిపెట్టి వెళ్లారేమో: దేవినేని ఉమ 

‘చలో మాచర్ల’ను పోలీసులు అడ్డుకోవడాన్ని తెదేపా నేత దేవినేని ఉమ ఖండించారు. పిన్నెల్లిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆయన దేశం వదిలిపెట్టి వెళ్లారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన అదృశ్యం వెనుక ధనుంజయ్‌రెడ్డి ఉన్నారని ఆరోపించారు. కేంద్ర అధికారుల ఆధ్వర్యంలోనే ఓట్ల కౌంటింగ్‌ జరగాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని