Atchannaidu: వైకాపా డంప్‌లు బట్టబయలైనా చర్యలేవీ?: అచ్చెన్నాయుడు

రేణిగుంట ఎఫ్‌సీఐ గోదాం వద్ద వైకాపా నేతల నగదు, మద్యం, ప్రచార సామగ్రికి సంబంధించిన డంప్‌లు బట్టబయలైనా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Published : 27 Mar 2024 14:35 IST

అమరావతి: రేణిగుంట ఎఫ్‌సీఐ గోదాం వద్ద వైకాపా నేతల నగదు, మద్యం, ప్రచార సామగ్రికి సంబంధించిన డంప్‌లు బట్టబయలైనా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఇలాంటివి నాలుగు డంప్‌లు రేణిగుంటలో ఉన్న విషయాన్ని తమ పార్టీ నేతలు సాక్ష్యాధారాలతో సహా నిరూపించారన్నారు. అయినా అధికారులు స్పందించక పోవడం వెనుక తాడేపల్లి పెద్దల ఒత్తిళ్లు ఉన్న విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. ఈ డంప్‌ వెనుక ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చంద్రగిరి అభ్యర్థి మోహిత్‌రెడ్డిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇద్దరినీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని అచ్చెన్నాయుడు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని