Atchannaidu: వచ్చేది తెదేపా ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు

దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి.. ఇవాళ ఏం చేస్తున్నారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రశ్నించారు.

Published : 28 Nov 2023 14:14 IST

మంగళగిరి: దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి.. ఇవాళ ఏం చేస్తున్నారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం అమ్మకాలు మొదలుపెట్టి డబ్బును ప్యాలెస్‌కు తరలిస్తున్నారని విమర్శించారు. మద్యం ధరలు పెంచడమే కాదు.. నాసిరకం మద్యాన్ని పంపిణీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.

పశువులూ అల్లాడుతున్నాయ్‌!

‘‘మద్యం దుకాణాల్లో ఎక్కడా డిజిటల్‌ పేమెంట్స్‌ లేకుండా చేశారు. చంద్రబాబు (ChandraBabu) అమలు చేసిన ఉచిత ఇసుక విధానంపైనా అక్కసు వెళ్లగక్కారు. ఇసుక లభించక లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ఆదాయం వచ్చే శాఖల్లో మీ సామాజిక వర్గానికి చెందినవారినే నియమించుకున్నారు.  వచ్చేది తెదేపా (TDP) ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం. అర్హతలేని వ్యక్తిని తితిదే ఈవోగా నియమించారు. తితిదేలో జగన్‌.. తన బంధువులను నియమించుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సామాజిక న్యాయం అంటే నీ సొంత వర్గానికి న్యాయం చేయటమా జగన్ రెడ్డి?’’ అని అచ్చెన్న ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని