Bhatti Vikramarka: అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క

వర్షాలకు తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 21 May 2024 18:19 IST

హైదరాబాద్‌: వర్షాలకు తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటన్నారు. 15 రోజుల ముందుగానే ధాన్యం కొంటున్నట్లు వివరించారు. గతం కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు చెప్పారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని అప్పటి ప్రభుత్వం కొనలేదని చెప్పారు. 

‘‘చివరి గింజ వరకూ కొంటాం.. రైతులు ఆందోళన చెందవద్దు. తడిచిన, మొలకెత్తిన ధాన్యానికి కూడా ఎంఎస్‌పీ ఇచ్చి తీసుకుంటాం. ధాన్యం రైతులకు మూడు రోజుల్లోనే డబ్బు అందిస్తున్నాం. వర్షసూచనపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలి. రూ.500 బోనస్‌ సన్న ధాన్యానికే అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రూ.500 బోనస్‌ అనేది సన్న ధాన్యం నుంచి మొదలుపెట్టాం’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు