TDP: యదుభూషణ్‌రెడ్డికి ఎన్నికల బాధ్యతలు కేటాయించవద్దు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి

డ్వామా పీడీగా ఉన్న యదుభూషణ్ రెడ్డికి ఎలాంటి ఎన్నికల బాధ్యతలు కేటాయించవద్దని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.

Updated : 10 Mar 2024 13:03 IST

కడప: డ్వామా పీడీగా ఉన్న యదుభూషణ్ రెడ్డికి ఎలాంటి ఎన్నికల బాధ్యతలు కేటాయించవద్దని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన పదవీ విరమణ పొందాక వైకాపా ప్రభుత్వం పదవీకాలం పొడిగించిందని గుర్తుచేశారు. ఎన్నికల పరిశీలకులకు ప్రొటోకాల్ ఏర్పాట్లు చేసే బాధ్యతలను యదుభూషణ్ రెడ్డికి అప్పగించారని.. ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రజలు, పార్టీలు.. కేంద్ర ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకువచ్చే క్రమంలో భాషా సమస్య వస్తోందన్నారు. యదుభూషణ్‌ రెడ్డి అధికార పార్టీకి అనుకూలమైన అధికారి కాబట్టి విషయాల్ని సరిగా తర్జుమా చేయకపోవచ్చని భూమిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని