Loksabha polls: ప్రశాంత్‌ కిషోర్‌ భాజపా ఏజెంట్‌: తేజస్వీ యాదవ్

Eenadu icon
By Politics News Team Updated : 24 May 2024 17:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పట్నా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ (Prashant Kishor)పై ఆర్జేడీ నేత తేజస్వీ (Tejashwi Yadav) తీవ్ర ఆరోపణలు చేశారు. అతడు భాజపా (BJP)కు ఏజెంట్‌గా పని చేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో భాజపా  ఓడిపోనుందని, ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి భాజపా ఆయనను రంగంలోకి దింపిందని అన్నారు. ‘‘నీతీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్)లో కిషోర్‌ సభ్యుడిగా ఉన్న సమయంలో అమిత్ షా కోరిక మేరకే అతడిని  జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిని చేశానని మా మామ (నీతీష్ కుమార్) చెప్పారు. ఇప్పటివరకు అమిత్ షా గానీ, ప్రశాంత్ కిషోర్ గానీ ఆ వాదనను ఖండించలేదు. ఆయన భాజపాలోనే ఉన్నారు. అతడు ఏ పార్టీలో చేరినా అది నాశనం అవుతుంది’’ అని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు.

ప్రశాంత్‌ కిషోర్‌కు డబ్బు ఎక్కడినుంచి వస్తుందో తెలియదని, ప్రతీ సంవత్సరం వేర్వేరు వ్యక్తులతో కలిసి పని చేస్తుంటాడని తేజస్వీ అన్నారు. ఒకరి డేటాను తీసుకొని మరొకరికి ఇస్తాడన్నారు. కిషోర్‌  భాజపా కోసం పని చేస్తూ, వారి సిద్ధాంతాలను అనుసరిస్తున్నాడని మండిపడ్డారు. వారి వ్యూహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అతడికి నిధులు సమకూరుస్తోందని తేజస్వి పేర్కొన్నారు. 

ప్రస్తుతం బిహార్‌లో జన్ సురాజ్ అనే పార్టీని స్థాపించిన ప్రశాంత్‌ కిషోర్‌ అంతకుముందు నీతీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్)లో సభ్యుడిగా విధులు నిర్వర్తించారు. 2020లో నితీష్ కుమార్, హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు తాను కిషోర్‌ను పార్టీలో చేర్చుకున్నానని చెప్పడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి.

Tags :
Published : 24 May 2024 17:41 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని