BJP: కేరళలో ఖాతా తెరిచిన భాజపా.. ఆ స్థానంలో ఘన విజయం

కేరళలోని త్రిశ్శూర్‌ నియోజకవర్గంలో భాజపా ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి సురేశ్‌ గోపీ 74 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.

Published : 04 Jun 2024 18:18 IST

దిల్లీ: ఇప్పటివరకు ఉత్తరాదిలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP).. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దక్షిణాదిలోనూ మెరుగైన ఫలితాలు సాధించింది. ఈ క్రమంలో కేరళలో తొలిసారి ఖాతా తెరిచింది. త్రిశ్శూర్‌ నియోజకవర్గంలో 74 వేలకు పైగా మెజార్టీతో కాషాయ పార్టీ విజయం సాధించింది.

ఇంతకుముందు వరకు తిరువనంతపురంలో భాజపా అభ్యర్థి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆధిక్యంలో ఉండగా.. కాసేపటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ దూసుకొచ్చారు. భాజపాపై ఘన విజయం సాధించారు. కేరళలో మొత్తం 20 ఎంపీ స్థానాలుండగా.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా, సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌)  త్రిశ్శూర్‌లో గెలుపొందగా.. అలత్తూర్‌లో లీడింగ్‌లో ఉంది.

‘ఇక మీ లగేజ్‌ సర్దుకోండి’ ప్రత్యర్థికి కంగనా కౌంటర్‌

త్రిశ్శూర్‌లో కాషాయ పార్టీ అభ్యర్థి సురేశ్‌ గోపీ 74 వేలకు పైగా మెజారిటీ గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా.. ఎన్నికలకు ముందు దక్షిణాదిపై పట్టుకు తీవ్రంగా శ్రమించింది. ఈసారి దక్షిణాదిలో వీలైన స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ జోరుగా ప్రచారం చేశారు. ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా మద్దతున్న ఈ రాష్ట్రాల్లో భాజపా కేరళలో బోణీ కొట్టింది. మరికాసేట్లో పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు