Lok Sabha Polls: దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్‌ షా

దక్షిణాదిలో భాజపా ఈసారి అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తంచేశారు.

Published : 18 Apr 2024 21:13 IST

గాంధీనగర్‌: దక్షిణాదిలో పట్టు సాధించేందుకు కమలనాథులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఇక్కడ అధిక సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈనేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో ఈసారి తమ పార్టీ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తాను పోటీ చేస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఎన్నికల ప్రచార రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్‌’ డిప్యూటీ సీఎం కుమార్తె

దేశంలో వాతావరణం చూస్తుంటే తమకు 400లకు పైగా సీట్లు వచ్చేలా కనబడుతోందన్నారు. దక్షిణాదిలోనూ ఇదివరకు ఎన్నడూ లేనంతగా పార్టీ పనితీరు ఉండబోతుందని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో తమ పార్టీ మొత్తం 26 స్థానాలనూ అధిక మెజార్టీతో కైవసం చేసుకుంటుందని అమిత్‌ షా ధీమా వ్యక్తంచేశారు. గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. మే 7న ఇక్కడ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని