Boxer Vijender Singh: కాంగ్రెస్‌కు షాక్‌.. భాజపాలోకి బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌

Boxer Vijender Singh: ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ నేడు భాజపాలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయి.

Updated : 03 Apr 2024 20:08 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చేరికలు జోరందుకున్నాయి. తాజాగా ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌కు షాకిచ్చారు. హస్తం పార్టీని వీడి భాజపా గూటికి వెళ్లారు. బుధవారం ఆ పార్టీ నేతల సమక్షంలో కాషాయ కండువా వేసుకున్నారు. 

బాక్సింగ్‌లో భారత్‌ తరఫున తొలి ఒలింపిక్‌ పతకం సాధించిన విజేందర్‌.. గత సార్వత్రిక ఎన్నికల ముందు 2019లో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో దక్షిణ దిల్లీ నుంచి హస్తం అభ్యర్థిగా పోటీ చేసి భాజపా నేత రమేశ్‌ బిధూరీ చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది అప్పటి భారత రెజ్లింగ్‌ సమాఖ్య బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు విజేందర్‌ మద్దతిచ్చారు. వారితో పాటు ఆందోళనలోను పాల్గొన్నారు.

మోదీకి సరైన పోటీ ఎవరు..? శశిథరూర్‌ ఆసక్తికర సమాధానం

హరియాణాలో అత్యధిక రాజకీయ ప్రాబల్యం ఉన్న జాట్‌ వర్గానికి చెందిన విజేందర్‌కు ఈ ఎన్నికల్లోనూ టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ భావించింది. భాజపా ఎంపీ హేమామాలిని పోటీ చేస్తున్న మథుర (ఉత్తరప్రదేశ్‌) స్థానం నుంచి బరిలోకి దించే అవకాశాలున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ‘ప్రజలు కోరుకుంటే ఎక్కడినుంచైనా సిద్ధమే’ అంటూ ఇటీవల ఆయన చేసిన ట్వీట్‌ ఈ ఊహాగానాలను మరింత బలపర్చింది. ఈలోగా ఉన్నట్టుండి ఆయన పార్టీ మారడం ప్రాధాన్యం సంతరించుకుంది. భాజపా తరఫున ఆయన బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదు. అయితే ఏ స్థానం నుంచి అనేది ఇంకా స్పష్టత లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని