BRS: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారాస విజయం సాధించింది.

Updated : 02 Jun 2024 16:09 IST

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారాస విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై భారాస అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్ల తేడాతో గెలుపొందారు. మార్చి 28న పోలింగ్‌ నిర్వహించగా.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో కౌంటింగ్‌ నిర్వహించారు. 

ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా.. 1,437 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్‌ కోసం మొత్తం ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు. 1437 ఓట్లలో 21 చెల్లనివిగా గుర్తించారు. మిగిలిన 1416 ఓట్లలో నవీన్‌కుమార్‌రెడ్డికి 762, మన్నె జీవన్‌రెడ్డికి 653, స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు వచ్చాయి. 

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని