Btech Ravi: ఆ తర్వాత అంతఃపుర రహస్యం ఏం జరిగిందో?: తెదేపా నేత బీటెక్‌ రవి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని తెదేపా నేత బీటెక్‌ రవి అన్నారు.

Updated : 03 Apr 2024 15:31 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని తెదేపా నేత బీటెక్‌ రవి అన్నారు. ఈ హత్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి పత్రిక పలు రకాల ఆరోపణలు చేసినట్లు చెప్పారు. కడపలో మీడియాతో ఆయన మాట్లాడారు.

‘‘బాబాయ్‌ హత్య గురించి షర్మిల కుండబద్దలు కొట్టారు. తనను ఎంపీగా పోటీ చేయించేందుకు చిన్నాన్న ఒత్తిడి తెచ్చారని ఆమె చెప్పారు. గతంలో కడప ఎంపీగా పోటీకి ఆమె ఒప్పుకొన్నట్లు జగన్‌కు వివేకా తెలిపారు. ఆ తర్వాత అంతఃపుర రహస్యం ఏం జరిగిందో? పోటీకి షర్మిల అంగీకరించాక ఆయన హత్యకు కుట్ర జరిగింది. అవినాష్‌రెడ్డికి సిగ్గు ఉంటే ఎంపీ బరి నుంచి తప్పుకోవాలి. వివేకాను హత్య చేసిన వ్యక్తిని షర్మిలపై పోటీకి నిలిపారు. రక్తపు మరకల పునాదుల మధ్య పుట్టిన పార్టీ వైకాపా. హంతకులు జగన్‌ చుట్టే తిరుగుతున్నారు.’’ అని బీటెక్‌ రవి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని