Chandrababu: ఎన్నికలు లాంఛనమే.. కూటమిదే విజయం: చంద్రబాబు

ఎన్నికలు లాంఛనమే.. కూటమే గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 11 Apr 2024 19:36 IST

అంబాజీపేట: ఎన్నికలు లాంఛనమే.. కూటమే  గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇది చాలా కీలక సమయం.. ఐదేళ్ల  నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే సమయం వచ్చిందన్నారు.

‘‘చట్టబద్ధంగా కులగణన చేపడతాం. బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటా. సబ్‌ ప్లాన్‌ ద్వారా బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొస్తాం. స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు తీసుకొస్తాం. ఆదరణ పథకం కింద రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తాం. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతాం. వరికి గిట్టుబాటు ధర కల్పిస్తాం, కొబ్బరి ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తాం. వైకాపా పాలనలో ఏ ఒక్క కుటుంబానికి న్యాయం జరగలేదు. సిద్ధం.. సిద్ధం అంటున్న వారికి యద్ధం ఇద్దామని పవన్‌ చెప్పారు. మూడు జెండాలు వేరైనా లక్ష్యం ఒక్కటే. రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ప్రజలు సహకరించాలి’’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని