ChandraBabu: ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయం: చంద్రబాబు

ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్‌ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 31 Mar 2024 16:23 IST

ఎమ్మిగనూరు: ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్‌ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘‘నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్‌. భాజపాతో తాత్కాలిక పొత్తు అంటూ నా పేరుతో లేఖ రాసి సోషల్‌మీడియాలో వైకాపా దుష్ప్రచారం చేస్తోంది. తెదేపా డీఎన్ఏలోనే బీసీ ఉంది. మాది పేదల పక్షం.. మీతోనే ఉంటాం. వైకాపాలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటున్నారు. అది భూస్వాములు, పెత్తందారుల పార్టీ.

వైకాపా హయాంలో రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారు. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ, దిశ మారుస్తాం. రాయలసీమ ద్రోహి జగన్‌కు ఒక్క ఓటు కూడా వేయవద్దు. ఆయనకు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు. సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు ఎన్టీఆర్‌. అన్ని వర్గాల పేదలను పైకి తీసుకొచ్చిన పార్టీ తెదేపా. వెనుకబడిన వర్గాలకు రూ.1.5 లక్షల కోట్లతో సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేస్తాం. చట్టపరంగా కులగణన నిర్వహిస్తాం. దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేస్తాం. కురబలను ఎస్సీ, బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తాం. ఎమ్మిగనూరుకు టెక్స్‌టైల్‌ పార్కు తీసుకువస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని