Chikoti Praveen: చీకోటి ప్రవీణ్‌కు చేదు అనుభవం.. భాజపాలో చేరిక వాయిదా?

భాజపాలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్న క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు చుక్కెదురైంది.

Published : 12 Sep 2023 21:11 IST

హైదరాబాద్‌: భాజపాలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్న క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు చుక్కెదురైంది. భాజపాలో చేరడానికి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి సంతోష్‌ నగర్‌ నుంచి ర్యాలీగా.. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి చీకోటి వచ్చారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోసం చీకోటి, తన అనుచరులు పడిగాపులు కాశారు. చీకోటి రాకుముందే పార్టీ కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి వెళ్లిపోయారు. దీంతో హంగు ఆర్భాటాలతో వచ్చిన చీకోటి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది ఏమీ లేక పార్టీ కార్యాలయం నుంచి చీకోటి వెనుదిరిగి వెళ్లిపోయారు. 

భాజపా అంటే క్రమశిక్షణకు మారుపేరని, పార్టీ పెద్దలతో భేటీ తర్వాత తన కార్యాచరణ ప్రకటిస్తానని చీకోటి ప్రవీణ్‌ తెలిపారు.రాజకీయాల్లో ఆవేశం పనికిరాదని, ఓపికగా ఉండాలని అభిమానులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు