Opinion Poll vs Exit Poll: ఒపీనియన్‌ పోల్‌కు ఎగ్జిట్‌ పోల్‌కు మధ్య వ్యత్యాసం ఏంటి?

Opinion Poll vs Exit Poll: ఎన్నికల సమయంలో ఒపీనియన్‌ పోల్‌, ఎగ్జిట్‌ పోల్‌ వంటి పదాలు తరచూ వినిపిస్తుంటాయి. ఈ రెండింటికీ మధ్య వ్యత్యాసం ఏంటి?

Published : 28 May 2024 15:27 IST

Opinion Poll vs Exit Poll | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల సమయంలో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి మెజారిటీ రాబోతోంది? అంటూ అనేక విశ్లేషణలు, అంచనాలు వెలువడుతుంటాయి. ఎన్నికల సీజన్‌ ప్రారంభమైంది మొదలు.. ముగిసేవరకు ఈ చర్చ కొనసాగుతుంటుంది. ఈ క్రమంలో ఒపీనియన్‌ పోల్స్‌, ఎగ్జిట్‌ పోల్స్‌ (Opinion Poll vs Exit Poll) అనే పదాలు తరచూ వినిపిస్తుంటాయి. ఇంతకీ ఏమిటివి? రెండింటి మధ్య తేడా ఏంటి?

కొన్ని మీడియా/ ప్రైవేటుసంస్థలు ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రజల నాడిని తెలుసుకునేందుకు అభిప్రాయాలు సేకరిస్తుంటాయి. దీన్నే ఒపీనియన్‌ పోల్‌ అంటారు. అలా సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ప్రీ పోల్‌ సర్వే ఫలితాల పేరిట ఆయా సంస్థలు అంచనాలను వెలువరిస్తుంటాయి. ఎన్నికల పోలింగ్‌ రోజు బూత్‌ నుంచి బయటికొచ్చే ఓటరు నుంచి అభిప్రాయాలు సేకరించడాన్ని ఎగ్జిట్‌ పోల్‌ అంటారు. ఇలా ఒక్కో ఓటరు నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అంచనాలు వెలువరిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 1న ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు వెలువడనున్నాయి.

ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు ఎప్పుడు..? చివరి విడత పోలింగ్‌ తరువాతే ఎందుకు?

ఎన్నికల ముందు నిర్వహించే ఒపీనియన్‌ పోల్స్‌లో ఓటర్లు తాము ఏ పార్టీకి/ నేతకు ఓటు వేసేది? చెప్పడంతో పాటు అందుకుగల కారణాలను కూడా వెల్లడిస్తుంటారు. ఓటర్ల మూడ్‌ను ఇది తెలియజేస్తుంది. అయితే, ఇలా అభిప్రాయాలు వ్యక్తీకరించిన అందరూ ఓటేస్తారన్న నమ్మకం ఉండదు. అంతేకాదు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఓటరు తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశమూ ఉంటుంది. ఎన్నికలకు ఒకట్రెండు రోజుల ముందు జరిగే పరిణామాలు కూడా ఇందుక్కారణం. ఎగ్జిట్‌ పోల్‌ అనేది ఏ పార్టీకి ఓటేశామనేది  మాత్రమే చెబుతారు. అందుకే ఈ అంచనాలు ఒక్కోసారి వాస్తవ ఫలితాలను ప్రతిబింబిస్తాయి. కొన్నిసార్లు ఈ అంచనాలు తలకిందులవుతుంటాయి.   ఈ రెండు సందర్భాల్లోనూ ఓటరు నిజమే చెబుతారని అనుకోవడానికి లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు