‘కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం జగన్‌కు లేదు’

సీఎం జగన్‌ చెబుతున్న మూడు రాజధానుల ఆలోచన రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ అన్నారు. గుంటూరులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం...

Published : 10 Feb 2020 14:56 IST

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

గుంటూరు: సీఎం జగన్‌ చెబుతున్న మూడు రాజధానుల ఆలోచన రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ అన్నారు. గుంటూరులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు నెలల పాలనలోనే జగన్‌ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా ఒక్కటే మార్గమని.. మూడు రాజధానులు కాదని అభిప్రాయపడ్డారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పే జగన్‌.. ప్రత్యేకోహోదా కోసం 22 మంది వైకాపా ఎంపీలతో ఎందుకు లోక్‌సభను స్తంభింపజేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం సీఎంకు లేదన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. మీడియా సమావేశంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి, మస్తాన్ వలి, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని