Konda Vishweshwar Reddy: కాంగ్రెస్‌లో చేరిక ప్రచారం అవాస్తవం: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో భారాసను ఢీకొట్టే పార్టీ భాజపాయేనని ప్రజలు నమ్ముతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

Updated : 21 May 2023 06:57 IST

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: తెలంగాణలో భారాసను ఢీకొట్టే పార్టీ భాజపాయేనని ప్రజలు నమ్ముతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. భాజపాలో కొందరు అసంతృప్తితో ఉన్నారని, కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నారన్న ప్రచారం అవాస్తవమన్నారు. తాము ఎక్కడకూ వెళ్లడం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను వ్యతిరేకించే అంశంలో భాజపా, రేవంత్‌రెడ్డి లక్ష్యం ఒక్కటేనన్నారు. రేవంత్‌రెడ్డి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా సిద్ధాంతానికి కట్టుబడిన పార్టీ అని, తమ పార్టీ నేతలు, కార్యకర్తలను కొనుగోలు చేయడం సులువు కాదని తెలిపారు. కవిత అరెస్టు విషయమై మాట్లాడుతూ.. న్యాయస్థానం, సీబీఐ, ఈడీలు అరెస్టు చేస్తాయని, భాజపా చేయలేదని చెప్పారు. కర్ణాటకలో పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ మారుతున్నారని దుష్ప్రచారం చేయడం తగదని భాజపా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని