Mopidevi Venkataramana: మనసు చంపుకొని పని చేయాల్సి వస్తోంది: రాజ్యసభ సభ్యుడు మోపిదేవి

ఇష్టం లేని వ్యక్తుల కోసం మనసు చంపుకుని పని చేయాల్సి వస్తోందని మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు వ్యాఖ్యానించారు.

Updated : 26 Dec 2023 09:52 IST

రాజకీయాల్లో ఇష్టం లేని వ్యక్తులతోనూ కొనసాగక తప్పదు

ఈనాడు, అమరావతి: ఇష్టం లేని వ్యక్తుల కోసం మనసు చంపుకుని పని చేయాల్సి వస్తోందని మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు (Mopidevi Venkataramana) వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కొనసాగాలంటే ఇష్టం లేని వ్యక్తులతో కూడా పని చేయక తప్పదన్నారు. ఆదివారం రాత్రి బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో ఉపాధ్యాయుల సన్మానసభలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల రేపల్లె వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తగా మోపిదేవిని తప్పించి, ఈవూరు గణేష్‌ను నియమించారు. అప్పటి నుంచి మోపిదేవి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే వైకాపా అధిష్ఠానానికి కట్టుబడి పని చేయాలని చెబుతున్న ఎంపీ.. తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కొనసాగాలంటే కొన్ని ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుందని.. కొంతమంది అర్హత లేని ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వాలని కూడా సిఫార్సు చేయాల్సి వస్తుందని ఆయన పేర్కొనడం గమనార్హం. ఈవూరు గణేష్‌ను ఉద్దేశించే మోపిదేవి ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని