శ్మశానంలో ఎన్నికల ప్రచారం !

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జె.పంగులూరు ఎస్సీ కాలనీలో మృతిచెందిన 14 మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించలేదు.

Published : 14 Mar 2024 05:46 IST

జె.పంగులూరు, మేదరమెట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జె.పంగులూరు ఎస్సీ కాలనీలో మృతిచెందిన 14 మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించలేదు. ఆ ఓట్లు తొలగించాలని జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ నేత పులిపాటి హేబేలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రయోజనం లేకపోవడంతో బుధవారం శ్మశానంలో ప్రచారం చేసి, సమాధుల వద్ద కరపత్రాలు ఉంచి నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని