ఇందిర, రాజీవ్‌ల స్ఫూర్తికి కులగణన విరుద్ధం

కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే జాతీయస్థాయిలో కులగణన చేపడతామంటూ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు ఆనంద్‌శర్మ భిన్నస్వరం వినిపించారు.

Published : 22 Mar 2024 04:44 IST

ఆనంద్‌శర్మ

దిల్లీ: కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే జాతీయస్థాయిలో కులగణన చేపడతామంటూ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు ఆనంద్‌శర్మ భిన్నస్వరం వినిపించారు. ‘కులగణన’ దివ్యౌషధం ఏమీ కాదని.. నిరుద్యోగం, అసమానతలను తొలగించదని అన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ గుర్తింపు రాజకీయాలు చేయలేదంటూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. ‘న జాత్‌ పర్‌ న పాత్‌ పర్‌.. మొహర్‌ లగేగీ హాథ్‌ పర్‌’ (కులాలపై కాదు.. హస్తం గుర్తుపైనే ఓటు ముద్ర) అని 1980లో ఇందిరాగాంధీ ఎన్నికల నినాదం చేశారు. 1990లో రాజీవ్‌గాంధీ సైతం కులతత్వాన్ని ఎన్నికల అంశంగా మార్చడాన్ని వ్యతిరేకించారు. కులతత్వంపై కాంగ్రెస్‌ చారిత్రక వైఖరిని ఇవి చాటిచెబుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ఆ ఆదర్శాల నుంచి దూరం జరిగితే ఇందిర, రాజీవ్‌ల స్ఫూర్తిని అగౌరవపరిచినట్లు ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లే ప్రమాదం ఉందని ఆనంద్‌శర్మ లేఖలో పేర్కొన్నారు.  ఆనంద్‌శర్మ లేఖను ‘ఎక్స్‌’లో షేర్‌ చేసిన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు.. ‘రాహుల్‌ను సరిదిద్దేందుకు విశ్వాసపాత్రులైన కాంగ్రెస్‌ నేతలు పూనుకొన్నట్టుంది’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని