రూ.91,325 కోట్లు ఏమయ్యాయి?

వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా మార్చిందని జనసేన పీఏపీ ఛైర్మన్‌, తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు.

Published : 25 Mar 2024 04:27 IST

అవినీతికి చిరునామాగా వైకాపా ప్రభుత్వం
జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ధ్వజం

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా మార్చిందని జనసేన పీఏపీ ఛైర్మన్‌, తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం భాజపా నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం అవినీతికి చిరునామాగా మారిందని, సుమారు రూ.7 లక్షల కోట్లు అప్పు చేస్తే.. అందులో రూ.91,325 కోట్లు ఎక్కడకు వెళ్లాయో ఈ రోజు వరకు లెక్క తేలలేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఏ విధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందో ఈ అంశం స్పష్టం చేసిందన్నారు. దేశానికి ప్రధాని మోదీ నాయకత్వం అవసరమని పవన్‌కల్యాణ్‌ నమ్మారని, అందుకే రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఉమ్మడిగా సాగాలని మూడు పార్టీలతో పొత్తుకు చొరవ చూపారని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని