ఎన్నికల కమిషన్‌ కాదు.. భాజపా కమిషన్‌: మమత

ముర్షీదాబాద్‌ రామనవమి ర్యాలీలో చోటు చేసుకున్న హింసపై పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.

Published : 19 Apr 2024 04:35 IST

రాయ్‌గంజ్‌ : ముర్షీదాబాద్‌ రామనవమి ర్యాలీలో చోటు చేసుకున్న హింసపై పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ హింస వెనక భాజపా హస్తం ఉందని గురువారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌.. భాజపా కమిషన్‌లా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. బుధవారం ముర్షీదాబాద్‌లోని శక్తిపుర్‌లో రామనవమి సందర్భంగా బాంబు పేలుడు జరిగింది. ఓ మహిళకు గాయాలయ్యాయి. రామనవమి ముందు రోజు ముర్షీదాబాద్‌ డీఐజీని తొలగించడాన్ని మమత తప్పుపట్టారు. భాజపాకు మేలు చేకూర్చడానికే ఎన్నికల కమిషన్‌ ఈ బదిలీ చేసిందని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని