12 మందికి నేరచరిత్ర

రాజస్థాన్‌లో లోక్‌సభకు పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులున్నాయి. వారిలో కొందరిపై హత్య కేసులూ ఉన్నాయి.

Published : 19 Apr 2024 04:58 IST

రాజస్థాన్‌లో అభ్యర్థులపై పలు కేసులు
(జైపుర్‌ నుంచి ప్రకాశ్‌ భండారీ)

రాజస్థాన్‌లో లోక్‌సభకు పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులున్నాయి. వారిలో కొందరిపై హత్య కేసులూ ఉన్నాయి.

  • బాడ్‌మేర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవీంద్ర సింగ్‌ భాటీపై ఆరు కేసులున్నాయి. జోధ్‌పుర్‌, బాడ్‌మేర్‌లో ఈ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ భాజపా తరఫున కైలాశ్‌ చౌధరి, కాంగ్రెస్‌ తరఫున ఉమ్మేదారామ్‌ పోటీ చేస్తున్నారు.
  • ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) అధినేత హనుమాన్‌ బేణీవాల్‌ నాగౌర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్‌ మద్దతిస్తోంది. భాజపా అభ్యర్థి జ్యోతి మీర్దాను ఆయన ఎదుర్కొంటున్నారు. బేణీవాల్‌పై హత్య, రాళ్లు విసరడం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడంతోపాటు మరికొన్ని అభియోగాలున్నాయి. విద్యార్థి నేతగా ఉన్నప్పుడూ ఆయనపై కేసులు నమోదయ్యాయి.
  • ఇంకా కేసులున్న అభ్యర్థుల్లో భజన్‌లాల్‌ యాదవ్‌ (కాంగ్రెస్‌, కరౌలీ-ధోల్‌పుర్‌), లలిత్‌ యాదవ్‌ (కాంగ్రెస్‌, అలవర్‌), అనిల్‌ చోప్రా (కాంగ్రెస్‌, జైపుర్‌ రూరల్‌), శుభ్‌కరణ్‌ చౌధరి (భాజపా, జైపుర్‌ రూరల్‌) ఉన్నారు. చౌధరిపై చెక్కు బౌన్స్‌ కేసు ఉంది.
  • బీఎస్పీ అభ్యర్థుల్లో ఫజల్‌ హుస్సేన్‌, హజారీ లాల్‌ ఉన్నారు.
  • స్థానికంగా చిన్న పార్టీకి చెందిన ధీరేంద్ర వర్మపై బలవంతపు వసూళ్ల కేసు ఉంది.
  • చురులో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి రమేశ్‌ కుమార్‌పై మూక దాడి కేసు ఉంది.
  • ఓం ప్రకాశ్‌ మీనా అనే స్వతంత్ర అభ్యర్థిపై వరకట్న వేధింపుల కేసు ఉంది.
  • మరో స్వతంత్ర అభ్యర్థి రాజేంద్ర సింగ్‌ శెఖావత్‌పై విద్వేష ప్రసంగం కేసు ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని