Tejashwi Yadav: పార్టీని కాపాడుకోవడానికి మామ ఏమైనా చేయగలడు: తేజస్వీ యాదవ్

Eenadu icon
By Politics News Team Updated : 28 May 2024 18:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పట్నా: జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం బిహార్‌ ముఖ్యమంత్రి మరోసారి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉంటారని రాష్ట్రీయ జనతాదళ్  నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) అన్నారు. బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ  ‘‘జూన్ 4 తర్వాత ముఖ్యమంత్రి నీతీష్‌కుమార్ (Nitish Kumar) తన పార్టీని, రాజకీయాల్లో వెనకబడిన తరగతులను కాపాడటానికి ఏదైనా చేయగలడు. ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోగలడు’’ అని పేర్కొన్నారు.

కాగా ముఖ్యమంత్రి పదవి కోసం గత దశాబ్దకాలంలో నీతీష్ ఐదుసార్లు పార్టీ మారారు. కాషాయ కండువా కాదని భాజపాకు వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో చేరిన ఆయన లోక్‌సభ ఎన్నికలకు ముందు తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. దీంతో రాజకీయవర్గాలు ఆయన చర్యలపై  అసహనం వ్యక్తంచేశాయి. అనంతరం ఓ ఎన్నికల ప్రచార సభలో నీతీష్‌ మాట్లాడుతూ తాను పార్టీ మారడం ఇదే చివరిసారి అని ఎప్పటికీ భాజపాను వీడనని తెలిపారు.

Tags :
Published : 28 May 2024 18:12 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని