Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌ కొట్టివేత

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక వివాదంపై  రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.  శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 

Updated : 10 Oct 2023 16:32 IST

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక వివాదంపై రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 

ఎవరి ధీమా వారిదే.. రానున్న 50 రోజులు అత్యంత కీలకం!

శ్రీనివాస్​గౌడ్​ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో​ తన​ ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని​ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్​ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని.. ఆయన ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇరు వర్గాల తరఫున వాదనలు విన్న ధర్మాసనం తాజాగా పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

న్యాయం.. ధర్మం గెలుస్తుంది

హైకోర్టు తీర్పుపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు. ‘‘న్యాయం, ధర్మం గెలుస్తుందని జిల్లా ప్రజలకు ముందే తెలుసు. గతంలో జిల్లాలను పాలించిన ఇద్దరు నేతలు వారి అస్తిత్వం కోసం కేసులు వేయించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీసీలను అడ్డం పెట్టుకుని కేసులు వేయించారు. గత పాలనలో జిల్లా కరవు, వలసల కష్టాలతో అల్లాడిపోయింది. భారాస పాలనలో రాష్ట్రం పచ్చని పంటలతో కలకలలాడుతోంది’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని