kanakamedala: ప్రభుత్వ సహకారం లేకుండా డ్రగ్స్‌ కంటెయినర్‌ వచ్చిందా?: కనకమేడల

బ్రెజిల్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు 31.10.2022న శుభాకాంక్షలు తెలుపుతూ విజయ సాయిరెడ్డి ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారని తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్‌ తెలిపారు.

Updated : 23 Mar 2024 17:21 IST

దిల్లీ: బ్రెజిల్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు 31.10.2022న శుభాకాంక్షలు తెలుపుతూ విజయ సాయిరెడ్డి ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారని తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్‌ తెలిపారు. ఆయన ఎందుకు శుభాకాంక్షలు తెలిపారనేది ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సంధ్య ఆక్వా ప్రైవేటు లిమిటెడ్‌ నిర్వాహకుడు కూనం వీరభద్రరావు.. వైకాపా నేత కూనం పూర్ణచంద్రరావుకు సోదరుడని తెలిపారు. పూర్ణచంద్రరావు వైకాపా కార్యకర్త అని, ఆయనకు విజయసాయిరెడ్డితో సత్సంబంధాలున్నాయని వివరించారు.

‘‘ఏ ప్రభుత్వ సహకారం లేకుండా రూ.50 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను డ్రై ఈస్ట్‌ పేరుతో ట్రాన్స్‌పోర్ట్‌ చేయడం సాధ్యమా? కూనం వీరభద్రరావుకు అంత పెట్టుబడి పెట్టే స్తోమత ఉందా? ఉంటే ఆ కంపెనీ ఆర్థిక రికార్డులు చెక్‌ చేశారా? వీటన్నింటికి వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డ్రగ్స్‌ ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయి. డ్రగ్స్‌ ఘటనకు తెదేపా వాళ్లు బాధ్యులని తప్పుడు ఆరోపణలు చేయడం మీ నిఘావైఫల్యం కాదా? భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, ఈ కంపెనీకి సంబంధం లేదు.. వైకాపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.

ఈ మాదక ద్రవ్యాలను లిక్కర్‌ కంపెనీలు తమ ఉత్పత్తుల్లో కలుపుతున్నాయని ఒక ఆరోపణ వస్తోంది. దీనిపై సీబీఐ విచారణ చేయాలి. నాసిరకం లిక్కర్‌తో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. మద్య నిషేధం చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని కనకమేడల డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని