KCR: క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరిన భారాస అధినేత కేసీఆర్‌

భారాస (BRS) అధినేత కేసీఆర్‌ (KCR) క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సాగునీరందక నష్టపోయిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించనున్నారు.

Updated : 31 Mar 2024 11:08 IST

హైదరాబాద్‌: భారాస (BRS) అధినేత కేసీఆర్‌ (KCR) క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సాగునీరందక ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో ఆయన వెళ్లారు. తొలుత జనగామ జిల్లా ధరావత్‌ తండాకు చేరుకుని పంటలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్‌ మండలాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం 3 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. 3:30కు తిరిగి బయల్దేరి.. సాయంత్రం 4:30కు నల్గొండ జిల్లా నిడమనూరు మండలానికి చేరుకుని రైతులతో మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గంలో ఎర్రవెల్లికి తిరుగు ప్రయాణమవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని