రోజుకు రూ.50 లక్షలతో మంత్రి జేబు నింపుతున్నారు: కౌశిక్‌రెడ్డి

ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోందని.. ఈ విషయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఎక్కడైనా చర్చకు సిద్ధమని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు.

Updated : 11 Jun 2024 15:28 IST

హైదరాబాద్‌: ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోందని.. ఈ విషయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఎక్కడైనా చర్చకు సిద్ధమని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. రెట్టింపు పరిమాణంతో ఫ్లైయాష్ తరలిస్తూ ఓవర్ లోడ్‌తో లారీలు వెళ్తున్నాయని.. ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకు రూ.50 లక్షలు డబ్బులు ముడుతున్నాయని మరోమారు ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

ఎమ్మెల్యేగా తాను స్వయంగా లారీలను పట్టుకుంటే రెండింటిని మాత్రమే సీజ్ చేసి మిగతా వాటిని వదిలిపెట్టారని కౌశిక్‌ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ మంత్రి ఫోన్‌తో లారీలను అధికారులు వదిలిపెట్టారని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని