మన దేశ చరిత్రలో ఇది అసామాన్య విజయగాథ : కేటీఆర్‌

నల్గొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో రెండు యూనిట్ల బాయిలర్ లైట్‌ గురించి పంచుకోవడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 25 May 2024 12:05 IST

హైదరాబాద్‌: నల్గొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో రెండు యూనిట్ల బాయిలర్ లైట్‌ గురించి పంచుకోవడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్ ముందు చూపునకు యాదాద్రి థర్మల్‌ పవర్ స్టేషన్‌ అద్భుతమైన ఉదాహరణ అని ఆయన ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు. ‘‘మన దేశంలో 4 వేల మెగావాట్లతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అతిపెద్ద థర్మల్‌ ప్లాంట్‌ YTPS. గత భారాస ప్రభుత్వం దీని నిర్వహణను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించింది. దీని అంచనా విలువ సుమారుగా రూ.20,400 కోట్లు. మన దేశ చరిత్రలో ఇది అసామాన్య విజయగాథ’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని